23 Views

పిఠాపురం : దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదయాక్షేత్రంలో కార్తిక మాసం సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారు జామున నుంచి ఆలయానికి అధిక సంఖ్యలో పోటెత్తారు. పాదగయ పుష్కరిణిలో మహిళలు పవిత్ర స్నానమాచరించి కార్తీకదీపాలను పుష్కరిణిలో విడిచిపెట్టారు. ఆలయ ప్రాంగణంతో శివనామస్మరణతో మారుమోగింది. తెల్లవారు జామునుంచే శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామికి, పదవ శక్తి పీఠం పురుహూతికా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మహిళలకు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. పసిపిల్లలకు తల్లులు పాలు ఇవ్వడం కోసం ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేశారు. రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, భీమవరం ఇలా పలు దూర ప్రాంతాల నుంచి పాదగయకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

Share.
Leave A Reply