25 Views

పిఠాపురం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జీ ఖండవల్లి లోవరాజు డిమాండ్‌ చేశారు. ఈ సంధర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తామనే ఆంశం లేవనెత్తడంతో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టిడిపి పార్టీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేపట్టడం సరికాదని, సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలిచి నేడు అదే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చి ఉద్యోగులను తప్పుద్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడంతో ఓట్లువేసి అధికారం అందించాకా ప్రజలను తప్పుద్రోవ పట్టించి, నేడు స్టీల్‌ ప్లాంట్‌ అమ్మే ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వాన్ని స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో విమర్శలు చేసిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న పని ఏమిటని ప్రశ్నించారు. హితవు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులుకు న్యాయం చేస్తామని నీతితప్పి చేస్తున్న పనులు సరికాదన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మడం విషయం వదిలేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిసెంబర్‌ 1వ తేదీన భారీ ఎత్తున విశాఖపట్నంలోని కూర్మన్నమాలెం సెంటర్‌లో భారీ ఉద్యమం చేపట్టబోతున్నామని తెలియజేశారు. అదే విధంగా ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. 1వ తేదీన జరగబోయే బహుజన ధర్నాకు ముఖ్యఅతిధులుగా బహుజన సమాజ్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంఛార్జీ, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, మాజీ ఎమ్మెల్యే లక్కే రాజారావు, స్టేట్‌ కోఆర్డినేటర్‌, మాజీ డిజిపి జె.పూర్ణచంద్రరావు, సెంట్రల్‌ కోఆర్డినేటర్‌ ఎం.బాలయ్యలు హాజరౌతారన్నారు. ఈ సమావేశంలో బహుజన సమాజ్‌ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు సుబ్బుభాయ్‌, ఇంఛార్జీ సబ్బరపు అప్పారావు, కాకినాడ రూరల్‌ ఇంఛార్జీ సాధనాల రాజు, జగ్గంపేట ఇంఛార్జీ జుత్తుక నాగేశ్వరరావు, ఎపి స్టూడెంట్‌ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి బుల్లిరాజు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply