పిఠాపురం : పట్టణంలోని అగ్రహారం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వున్న మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రిన్సిపాల్ కట్ట నాగేశ్వర దంపతులు జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూల మాలల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి బాలల దినోత్సవం వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీదకు విచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ గురించి వివరించారు. అనంతరం ఆటలు, పాటలు డాన్సులతో అందర్నీ ఆకర్షించారు. ప్రిన్సిపల్ కట్ట నాగేశ్వర ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కట్ట నాగేశ్వర మీడియాతో మాట్లాడుతూ మన భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. 1991లో ఆకుల సూర్యనారాయణ మమత స్కూల్ స్థాపించడం జరిగిందని, అప్పటి నుంచి బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దటమే తమ స్కూల్ ప్రధాన అంశమని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం.సతీష్, బి.సంతోషి, కె.శివ జ్యోతి, సత్యవేణి, సునీత, జి.వీర భవానీ, కె.సూరిబాబు, ఎం.రాజు, ఎన్.ఝాన్సీ ప్రసన్న, జి.రష్మి, ఎ.గజేశ్వరి రావు, టి.చైతన్య, జి.మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.