పిఠాపురం : గొలితి లక్ష్మణరావు కుటుంబానికి దాతలు సహాయం అందించారు. పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న గొలితి లక్ష్మణ్ రావు భార్య కృప ఆర్థికంగా చాల ఇబ్బందీ పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయన భర్త లక్ష్మణరావు బ్రయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడంతో కాలు చెయ్యి లాగేయడం వల్ల ఏ పని చెయ్యలేక ఆర్థికంగా ఇబ్బంది పడటం జరుగుతుందన్నారు. జీవన పోరాటం చేస్తున్నారు కానీ, ఆమె పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని, ఇంట్లో వస్తువులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండటం చాలా బాధాకరమన్నారు. ఇవ్వన్నీ తాము కళ్ళారా చూసామని, చూసి చలించి పోయామన్నారు. వారి కుటుంబానికి ఏదో విధంగా సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో తమ వంతు బాధ్యతగా అమరాది వల్లిరామకృష్ణ, పి.ఎస్.ఎన్.మూర్తి, పెంకే జగదీష్, నల్లి నాగార్జున, పవన్ కుమార్ సహాయం చేయడం జరిగిందన్నారు. ఎవరైనా దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహాయం అందించాలని కోరారు. సహాయం చెయ్యాలనుకునే దాతలు గొలితి కృప 9553374053 ఫోన్ పే నెంబర్ కు చేయాలని తెలిపారు. వానపల్లి రాము, రమేష్, తోట నాగిని సహాయం అందించిన జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.