29 Views

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నందు పిఠాపురం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శిశు రక్షణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో గర్భిణీలకు, రోగులకు శిశు రక్షణ పై అవగాహన కల్పించి, వాళ్ళకి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని తెలియజేశారు. అక్రమ రవాణా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు, వారు తీసుకోవలసిన ఆహారపు అలవాట్లు గురించి అవగాహన కల్పించారు. శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని, తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు తాగడం వల్ల జరిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీసెస్ సభ్యులు కొంగు నూకరాజు, ఏ.గీత, సీహెచ్సి సూపరిడెంట్ డా పి.పూజిత, ఎస్.సబీనా, ఎస్.ఫనితేజ, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply