26 Views

పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా కాకినాడ జిల్లా జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు, జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు జగ్గంపేటలో గల జ్యోతుల నెహ్రూ స్వగృహంలో జ్యోతుల నెహ్రూను కలిసి జ్యోతుల శ్రీనివాసు గజమాలతో సత్కరించారు‌. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ మెట్టప్రాంత సీనియర్ నాయకుడు, అపర భగీరధులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయిన జ్యోతుల నెహ్రూని కలియుగదైవం అయినటువంటి వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ… సనాతన హిందూధర్మం పట్ల అంకితభావం గల, సనాతన ధర్మం కాపాడే విషయంలో జ్యోతుల నెహ్రూ తనదైన శైలిలో కాపాడగలుగుతారని, అదేవిధంగా గతం జ్యోతుల నెహ్రూ అనేక యజ్ఞయాగాదులు చేస్తూ హిందుత్వం పట్ల విశ్వాసం కలిగి, అంకితభావంతో హిందూ దేవిదేవతల పట్ల చాలా గౌరవంగా ఉండే వ్యక్తి అని జ్యోతుల నెహ్రూకి శుభాకాంక్షలు తెలియజేస్తూన్నానన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు మరియు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూని తిరుమల తిరుపతి పాలకమండలి సభ్యునిగా నియమించినందుకు ఎన్డీయే నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు‌. జ్యోతుల శ్రీనివాసు వెంట దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ మాజీ చైర్మన్ కందా శ్రీనివాసు, దుర్గాడ గ్రామ మాజీ ఎంపిటిసి సభ్యులు కోమ్మూరి కృష్ణ, మొగిలి‌ శ్రీను, జ్యోతుల సీతరాంబాబు, సఖినాల రాంబాబు, జ్యోతుల వాసు, మేడిబోయిన శ్రీను, జ్యోతుల శివ, కాపారపు వెంకటరమణ (పూసలు), కొలా శివ, జ్యోతుల వీరబాబు, సఖినాల లచ్చబాబు, జ్యోతుల శివశంఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply