26 Views

పిఠాపురం : ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా అఖిల భారత మాల సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రా మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు, వర్గీకరణ వ్యతిరేక జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సిద్దాంతపు కొండబాబు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నెల 26వ తేదీన భారత రాజ్యంగం దినోత్సవం రోజున గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో నిర్వహించబోయే మాల మహా గర్జనను విజయవంతం చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునః సమీక్షించాలని, దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం దళితులని చీల్చ వద్దని ఆయన కోరారు. సుప్రీంకోర్టులో కేసు వేసి వర్గీకరణ జరగకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పివి రావు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్సి వర్గీకరణ వ్యతిరేక జేఏసీ రాష్ట్ర చైర్మన్ పండు అశోక్ కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు, బీఎస్పీ నాయకుడు ఏనుగుపల్లి కృష్ణ, ఆంధ్రా మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివ ప్రసాద్, డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు దల్లి శ్రీనివాస్, పోతుల నాగరాజు, తంతడి కిరణ్, పివి రావు మాల మహానాడు బత్తిన శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply