13 Views

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు బొజ్జా లోవరాజు (నానాజీ) 61వ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన నాయకుడు చెల్లుబోయిన సతీష్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వారని, వృత్తి రీత్యా పోలీసు అధికారిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు. ఇంకా 18 నెలలు సర్వీస్ వున్నా పవన్ కళ్యాణ్ పై వున్న అభిమానంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గెలుపుకై నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారన్నారు. ఇటువంటి వ్యక్తికి పార్టీలో ఉన్నత పదవి రావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తేం సుందర్, కోలా సాయి, ఆగంటి ప్రభాకర్, రావుల రమణా రావు, చెల్లుబోయిన నాగేశ్వరరావు, కో-ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మేళం రామకృష్ణ (టైల్స్ బాబీ), పెదిరెడ్ల భీమేశ్వరరావు, కోలా దుర్గా దేవి, కుక్కల నాగమణి, పల్నాటి మధు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply