పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామంలో గల ఆంజనేయస్వామి ఆలయం నందు దసరా సందర్భంగా నవరాత్రులు నిర్వహణ అనంతరం ఆలయకమిటి వారు ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమానికి ఆంజనేయస్వామి ఆలయం కమిటి వారి ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు & జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు శుక్రవారం ఉదయం కుతుకుడుమిల్లి గ్రామం నందు గల ఆంజనేయస్వామి ఆలయంనకు వెళ్ళి ముందుగా ఆంజనేయస్వామి వారిని ఆలయ పెద్దల సమక్షంలో దర్శించుకొని, అనంతరం జరిగి అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ప్రసాదంను స్వీకరించారు. అనంతరం అన్నసంతర్పణ నిమిత్తం రూ:2వేలను తమ వంతు విరాళంగా ఆలయ కమిటి పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాకమిటి మాజీ చైర్మన్ కందా శ్రీనివాస్, జ్యోతుల సీతరాంబాబు, ఆలయ కమిటి పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.