13 Views

కాకినాడ : కరప మండలం పెనుగుదురు గ్రామంలో జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసిన దళిత కుటుంబం నేడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆత్మహయత్నం చేసుకుంటే కనీసం రూరల్ ఎమ్మెల్యే బాదితరాలిని పరామర్సించకపోవడం దారుణమని బిఎస్పీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవల్లి లోవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ ను బిఎస్పీ నాయకులు పరామర్సించి ఆత్మ హత్యయత్నానికి పురిగొల్పిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు మాతా సుబ్రహ్మణ్యం, ఖండవల్లి లోవరాజులు మీడియాతో మాట్లాడుతూ కరప మండలం పెనుగుదురు గ్రామంలో సుమారు పది సంవత్సరాలనుండి ఉపాధి హామీ పధకం క్షేత్ర స్థాయి సహాయరాలిగా పని చేస్తున్న పులపకూర సునీత ప్రస్తుతం జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎప్పుడు లేని విధంగా రాజకీయ ఒత్తిల్లు అధికంగా రావడం, ప్రతీ నెల మామూల్లు ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యోగం నుండి తీయించి వేస్తామని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారు మురళీ, నానీ అనే వ్యక్తులు బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో పురుగులు మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని తెలిపారు. బాధితరాలికి న్యాయం జరిగే వరకు బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇంత జరిగినా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పందించకపోవడం చాలా బాధాకరం అన్నారు. కారకులు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని లేని పక్షంలో దళితులు ఐక్యమత్యంగా పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరప మండలం అంబేద్కర్ యువజన సంఘం సెక్రటరీ ప్రత్తిపాటి బుల్లిరాజు, జిల్లా ఇన్ చార్జ్ పంతాడి కిరణ్, రాయి శ్రీనువాస్, ముఖే వీరబాబు, మచ్చ సుబ్బారావు తదితరులు ఉన్నారు.

Share.
Leave A Reply