పిఠాపురం : స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా నిన్న కాకినాడలోని సూర్య కళామందిర్ లో ఉపాధ్యాయులకు సాంస్కృతిక పోటీలు జరిగాయి. పాటలు, నృత్యం, నాటికలు, ఏకపాత్రాభినయం, మిమిక్రీ, మ్యాజిక్ షో, కవితలు, క్రీడలు, తదితర అంశాలలో ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వాద్య సంగీతం విభాగంలో వేణువు పై గీతాలాపన చేసి, పిఠాపురం పట్టణానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు పోతుల శ్రీనివాసు ప్రథమ బహుమతి సాధించారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఎన్. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆయన ప్రధమ బహుమతి స్వీకరించారు. రంగస్థల మరియు నంది నాటక కళాకారుడు, బౌద్ధ చారిత్రక పరిశోధకుడు అయిన శ్రీనివాసు గతంలో అప్పటి ముఖ్యమంత్రిగా వున్న, ప్రస్తుత నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును స్వీకరించారు. జిల్లాస్థాయిలో శ్రీనివాస్ ప్రథమ బహుమతి సాధించడం పట్ల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిఠాపురం పట్టణ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. శ్రీనివాసు, డి. ప్రవీణ్, గొల్లప్రోలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు ఈశ్వర రావు , ఎం.సత్యనారాయణ, సీనియర్ నాయకులు దాడి పద్మనాభం, సిహెచ్. సూరిబాబు, జన విజ్ఞాన వేదిక నాయకుడు ఎన్.సూర్యనారాయణ తదితరులు శ్రీనివాసుకు శుభాకాంక్షలు తెలియజేశారు.