170 Views

ఒడిస్సాలోని పూరీ జగన్నా థుని ఆలయంలోని రత్న బండార్ జులై 14 న తెరిచిన సంగతి పాఠకులకు తెలిసిందే, రెండో విడతగా ఈరోజు పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నా భాండాగారం మరోసారి నేడు తెరచుకోనుంది. అందులో ఉన్న నిధి నిక్షేపాలను వెలికితీసేం దుకు..అందులో ఉన్న సంపదను అన్వేషించేం దుకు ఈ రత్నభాండాగా రాన్ని అధికారులు మరో సారి తెరవనున్నారు..ఈ క్రమంలోనే 3 రోజుల పాటు పూరీ రత్నభాండాగా రంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎన్ఐ అధికారులు రెండో విడత సర్వే నిర్వహించను న్నారు. సర్వే సమయంలో భక్తుల దర్శనాలపై ఆంక్షలు విధించనున్నారు.అధికారు లు. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో రత్నా భాండాగారాన్ని మరోసారి తెరుచుకోనుంది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం పూరీ ఆలయంలో తొలివిడ త సర్వే నిర్వహించారు. తాజాగా రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ ఏఎన్ఐ అధికారులు శనివారం ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సర్వే లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు దేవతల దర్శనం కోసం వచ్చే భక్తులను నిలిపివే యనున్నారు.ఒడిశా రత్న భాండాగా రంలోని నిధి నిక్షేపాలను వెలికితీయడం సంపద అన్వేషణకు ఉద్దేశిం చిన ఈ సర్వే సోమవారం వరకు కొనసాగుతుంది. ఈ సర్వే కారణంగా మూడు రోజుల పాటు ఒడిశా పూరీ ఆలయంలో పలు ఆంక్షలు విధిస్తారు అధికారులు. ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తోబుట్టు వుల దేవతల దర్శనాన్ని భక్తులకు నిషేధించారు. సర్వేకు భక్తులు సహకరిం చాలని పూర్తీ ఆలయ అధికారులు విజ్నప్తి చేశారు. ఈ మూడు రోజుల పాటు నిర్వహించనున్న సర్వే సమయంలో పూరీ ఆలయం ప్రధాన ద్వారాల ను మూసివేయనున్నారు. ఆలయ రత్న భాండాగా రంలో ఏదైనా రహస్య గది లేదా సొరంగం ఉన్నాయా లేదా అనే విషయాలను ఈ సర్వే ద్వారా తేల్చనున్నట్లు రత్న భండాగర్ అత్యున్నం త స్థాయి కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రాథ తెలిపారు.

Share.
Leave A Reply