47 Views

రెయిన్బో ఈ స్మార్ట్ స్కూల్ లో నేషనల్ న్యూట్రీషన్ వీక్ ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు సమతుల్యమైన ఆహారాన్ని , తీసుకొనవలసిన మోతాదులను అందరికీ అర్ధమయ్యే విధంగా ఫుడ్ పిరమిడ్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్పి . అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ నేటి చిన్నారులే రేపటి పౌరులు , రేపటి తరం ఆరోగ్యకరంగా వున్నప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లలలో జంక్ ఫుడ్ ను తీసుకొనడం వలన కలిగే నష్టాలను తల్లిదండ్రులతో పాటు పిల్లలకు వివరించామన్నారు. ఆరోగ్యకరమైన సంపూర్ణమైన ఆహారమే శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మూలం అన్నారు. “హెల్తీ ఫుడ్ ఈస్ హెల్తీ ఫ్యూచర్” అని విద్యార్థులు నేర్చుకున్నారు. విద్యార్థులు ప్రదర్శనకు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం చాలా ప్రయోజకరమైనదని అన్నారు.

Share.
Leave A Reply